తెలుగు సంవత్సరాల పేర్లు – Names of Telugu Years
తెలుగు సంవత్సరాలు మొత్తం 60
- ప్రభవ – యజ్ఞాలు అధికంగా జరుగుతాయి
- విభవ – సుఖంగా జీవిస్తారు
- శుక్ల – సమృద్ధిగా పంటలు పండాలని కోరుకుంటారు
- ప్రమోద్యుత – అందరికీ ఆనందాన్ని ఇస్తుంది
- ప్రజోత్పత్తి – అన్నింటిలోనూ అభివృద్ధి ఉంటుంది
- అంగీరస – భోగాలు కలుగుతాయి
- శ్రీముఖ – వనరులు సమృద్ధిగా ఉంటాయి
- భావ – ఉన్నత భావాలు కలిగి ఉంటారు
- యువ – వర్షాలు కురిపించి పంటలు సమృద్ధిగా చేతికి అందుతాయి
- ధాత – అనారోగ్య బాధలు తగ్గుతాయి
- ఈశ్వర – క్షేమం, ఆరోగ్యాన్ని సూచిస్తుంది
- బహుధాన్య – దేశం సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని సూచిస్తుంది
- ప్రమాది – వర్షాలు మధ్యస్థంగా ఉంటాయి
- విక్రమ – పంటలు బాగా పండి రైతులు సంతోషిస్తారు, విజయాలు సాధిస్తారు
- వృష – వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి
- చిత్రభాను – అద్భుతమైన ఫలితాలు పొందుతారు
- స్వభాను – క్షేమము, ఆరోగ్యం ఇస్తుంది
- తారణ – సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి
- పార్థివ – ఐశ్వర్యం, సంపద పెరుగుతాయి
- వ్యయ – అతివృష్టి, అనవసర ఖర్చులు ఉంటాయి
- సర్వజిత్తు – సంతోషకరంగా చాలా వర్షాలు కురుస్తాయి
- సర్వదారి – సుభిక్షంగా ఉంటారు
- విరోధి – వర్షాలు లేకుండా ఇబ్బందులు పడే సమయం సూచిస్తుంది
- వికృతి – భయంకరంగా ఉంటుంది
- ఖర – పరిస్థితులు సాధారణంగా ఉంటాయి
- నందన – ప్రజలకు ఆనందం కలుగుతుంది
- విజయ – శత్రువులను జయిస్తారు
- జయ – లాభాలు, విజయం సాధిస్తారు
- మన్మధ – జ్వరాది బాధలు తొలగిపోతాయి
- దుర్ముఖి – ఇబ్బందులు ఉన్న క్షేమంగానే ఉంటారు
- హేవళంబి – ప్రజలు సంతోషంగా ఉంటారు
- విళంబి – ప్రజలు సుభిక్షంగా ఉంటారు
- వికారి – అనారోగ్యాన్ని కలిగిస్తుంది, శత్రువులకు చాలా కోపం తీసుకొస్తుంది
- శార్వరి – పంటలు దిగుబడి తక్కువగా ఉంటుంది
- ఫ్లవ – నీరు సమృద్ధిగా ఉంటుంది
- శుభకృత్ – శుభాలు కలిగిస్తుంది
- శోభకృత్ – లాభాలు ఇస్తుంది
- క్రోధి – కోపం కలిగిస్తుంది
- విశ్వావసు – ధనం సమృద్ధిగా ఉంటుంది
- పరాభవ – ప్రజల పరాభవాలకు గురవుతారు
- ఫ్లవంగ – నీరు సమృద్ధిగా ఉంటుంది
- కీలక – పంటలు బాగా పండుతాయి
- సౌమ్య – శుభ ఫలితాలు అధికం
- సాధారణ – సాధారణ పరిస్థితులు ఉంటాయి
- విరోధికృత్ – ప్రజల్లో విరోధం ఏర్పడుతుంది
- పరీధావి – ప్రజల్లో భయం ఎక్కువగా ఉంటుంది
- ప్రమాదీచ – ప్రమాదాలు ఎక్కువ
- ఆనంద – ఆనందంగా ఉంటారు
- రాక్షస – కఠిన హృదయం కలిగి ఉంటారు
- నల – పంటలు బాగా పండుతాయి
- పింగళ – సామాన్య ఫలితాలు కలుగుతాయి
- కాళయుక్తి – కాలానికి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి
- సిద్ధార్థి – కార్య సిద్ధి ఇస్తుంది
- రౌద్రి – ప్రజలకు చిన్నపాటి బాధలు ఉంటాయి
- దుర్మతి – వర్షాలు సామాన్యంగా ఉంటాయి
- దుందుభి – క్షేమం, ధ్యానం
- రుధిరోద్గారి – ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి
- రక్తాక్షి- అశుభాలు కలుగుతాయి
- క్రోధన – విజయాలు సిద్ధిస్తాయి
- అక్షయ – తరగని సంపదలు ఇస్తుంది