శ్రీ గోవింద నామాలు – Sri Govinda Namalu In Telugu

శ్రీ గోవింద నామాలు – Sri Govinda Namalu

శ్రీ శ్రీనివాసా గోవిందా, శ్రీ వేంకటేశా గోవిందా,
భక్త వత్సలా గోవిందా, భాగవత ప్రియ గోవిందా,
నిత్య నిర్మలా గోవిందా, నీల మేఘ శ్యామ గోవిందా,
పురాణ పురుషా గోవిందా, పుండరీకాక్ష గోవిందా,
గోవిందా హరి గోవిందా, గోకుల నందన గోవిందా,

నందనందనా గోవిందా, నవనీత చోరా గోవిందా,
పశుపాలక శ్రీ గోవిందా, పాప విమోచన గోవిందా,
దుష్ట సంహార గోవిందా, దురిత నివారణ గోవిందా,
శిష్ట పరిపాలక గోవిందా, కష్ట నివారణ గోవిందా,
గోవిందా హరి గోవిందా, గోకుల నందన గోవిందా,

వజ్ర మకుటధర గోవిందా, వరాహమూర్తివి గోవిందా,
గోపీజనలోల గోవిందా, గోవర్ధనోద్ధార గోవిందా,
దశరథ నందన గోవిందా, దశముఖ మర్దన గోవిందా,
పక్షివాహనా గోవిందా, పాండవ ప్రియ గోవిందా,
గోవిందా హరి గోవిందా, గోకుల నందన గోవిందా,

మత్స్యకూర్మ గోవిందా, మధుసూధన హరి గోవిందా,
వరాహ నరసింహ గోవిందా, వామన భృగురామ గోవిందా,
బలరామానుజ గోవిందా, బౌద్ధ కల్కిధర గోవిందా,
వేణుగానప్రియ గోవిందా, వేంకటరమణా గోవిందా,
గోవిందా హరి గోవిందా, గోకుల నందన గోవిందా,

సీతానాయక గోవిందా, శ్రితపరిపాలక గోవిందా,
దరిద్రజన పోషక గోవిందా, ధర్మసంస్థాపక గోవిందా,
అనాథరక్షక గోవిందా, ఆపద్భాందవ గోవిందా,
శరణాగతవత్సల గోవిందా, కరుణాసాగర గోవిందా,
గోవిందా హరి గోవిందా, గోకుల నందన గోవిందా,

కమలదళాక్ష గోవిందా, కామితఫలదాత గోవిందా,
పాపవినాశక గోవిందా, పాహి మురారే గోవిందా,
శ్రీ ముద్రాంకిత గోవిందా, శ్రీ వత్సాంకిత గోవిందా,
ధరణీనాయక గోవిందా, దినకరతేజా గోవిందా,
గోవిందా హరి గోవిందా, గోకుల నందన గోవిందా,

పద్మావతీప్రియ గోవిందా, ప్రసన్నమూర్తీ గోవిందా,
అభయహస్త ప్రదర్శక గోవిందా, మత్స్యావతార గోవిందా,
శంఖచక్రధర గోవిందా, శారంగదాధర గోవిందా,
విరాజాతీర్ధస్థ గోవిందా, విరోధిమర్ధన గోవిందా,
గోవిందా హరి గోవిందా, గోకుల నందన గోవిందా,

సాలగ్రామధర గోవిందా, సహస్రనామా గోవిందా,
లక్ష్మీవల్లభ గోవిందా, లక్ష్మణాగ్రజ గోవిందా,
కస్తూరితిలక గోవిందా, కాంచనాంబరధర గోవిందా,
గరుడవాహనా గోవిందా, గజరాజ రక్షక గోవిందా,
గోవిందా హరి గోవిందా, గోకుల నందన గోవిందా,

వానరసేవిత గోవిందా, వారధిబంధన గోవిందా,
ఏడుకొండలవాడ గోవిందా, ఏకత్వరూపా గోవిందా,
శ్రీ రామకృష్ణా గోవిందా, రఘుకుల నందన గోవిందా,
ప్రత్యక్షదేవా గోవిందా, పరమదయాకర గోవిందా,
గోవిందా హరి గోవిందా, గోకుల నందన గోవిందా,

వజ్రమకుటదర గోవిందా, వైజయంతిమాల గోవిందా,
వడ్డికాసులవాడ గోవిందా, వసుదేవతనయా గోవిందా,
బిల్వపత్రార్చిత గోవిందా, భిక్షుక సంస్తుత గోవిందా,
స్త్రీపుంసరూపా గోవిందా, శివకేశవమూర్తి గోవిందా,
బ్రహ్మాండరూపా గోవిందా, భక్తరక్షక గోవిందా
గోవిందా హరి గోవిందా, గోకుల నందన గోవిందా,

నిత్యకళ్యాణ గోవిందా, నీరజనాభ గోవిందా,
హాతీరామప్రియ గోవిందా, హరి సర్వోత్తమ గోవిందా,
జనార్ధనమూర్తి గోవిందా, జగత్సాక్షిరూపా గోవిందా,
అభిషేకప్రియ గోవిందా, ఆపన్నివారణ గోవిందా,
గోవిందా హరి గోవిందా, గోకుల నందన గోవిందా,

రత్నకిరీటా గోవిందా, రామానుజనుత గోవిందా,
స్వయంప్రకాశా గోవిందా, ఆశ్రితపక్ష గోవిందా,
నిత్యశుభప్రద గోవిందా, నిఖిలలోకేశా గోవిందా,
ఆనందరూపా గోవిందా, ఆద్యంతరహితా గోవిందా,
గోవిందా హరి గోవిందా, గోకుల నందన గోవిందా,

ఇహపర దాయక గోవిందా, ఇభరాజ రక్షక గోవిందా,
పరమదయాళో గోవిందా, పద్మనాభహరి గోవిందా,
తిరుమలవాసా గోవిందా, తులసీవనమాల గోవిందా,
శేషాద్రినిలయా గోవిందా, శేషసాయినీ గోవిందా,
శ్రీ శ్రీనివాసా గోవిందా, శ్రీ వేంకటేశా గోవిందా,

గోవిందా హరి గోవిందా, గోకుల నందన గోవిందా,
గోవిందా హరి గోవిందా, గోకుల నందన గోవిందా…

శ్రీ గోవింద నామాలు – Sri Govinda Namalu In Telugu

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top